HomeTelugu Big Storiesవీరసింహారెడ్డి: బాక్సాఫీస్‌ ఊచకోత.. ఫస్ట్‌ డే వసుల్‌ ఎంతంటే!

వీరసింహారెడ్డి: బాక్సాఫీస్‌ ఊచకోత.. ఫస్ట్‌ డే వసుల్‌ ఎంతంటే!

Veera simha reddy movie fir
నందమూరి బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా నిన్న విడదులైన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది.

హైదరాబాద్‌లో ఉదయం నాలుగు గంటల షోకే 54 థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ పడటం ఒక విశేషంగా చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజున 54 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం మరో విశేషం. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు.

శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో, హనీరోజ్ ముఖ్యమైన పాత్రను పోషించింది. తెలుగులో ఆమెకి ఇదే ఫస్టు మూవీ అయినప్పటికీ, తన పాత్రకు నిండుదనాన్ని తీసుకొచ్చింది.

20230113fr63c14632e163f

Recent Articles English

Gallery

Recent Articles Telugu