HomeTelugu Trending'వీరసింహా రెడ్డి' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘వీరసింహా రెడ్డి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Veera simha reddy release d
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వీరసింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ‘జనవరి 12’వ తేదీన విడుదల చేయనున్నట్టు కొంతకాలం క్రితమే చెప్పారు. అయితే సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల సంఖ్య పెరుగుతూ ఉండటం .. బాలయ్య సినిమా షూటింగు ఇంకా పూర్తి కాలేదనే టాక్ రావడంతో రిలీజ్ విషయంలో అందరికీ డౌట్ వచ్చింది.

దాంతో ఈ సినిమా టీమ్ రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం విడుదల చేసింది. ‘జనవరి 12వ తేదీన వస్తున్నా’ అంటూ బాలయ్య చూపుడు వ్రేలు చూపుతున్న పోస్టర్ ను విడుదల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్.. దునియా విజయ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu