HomeTelugu Newsవిజయ్ ఆంటోనీ 'బేతాళుడు'!

విజయ్ ఆంటోనీ ‘బేతాళుడు’!

విజయ్ ఆంటోని’ కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న ‘సైతాన్’ చిత్రం  తెలుగు ప్రేక్షకులను ‘బేతాళుడు’ గా త్వరలో పలకరించబోతోంది.
‘బేతాళుడు’ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 6 న ‘బేతాళుడు’ ఆడియో చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరగనుంది. తెలుగు,తమిళంలో చిత్రం నవంబర్ 18న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిపారు  నిర్మాత ఎస్.వేణుగోపాల్. ‘మానస్ రిషి ఎంటర్ ప్రైజస్’ సంస్థ తో కలసి ఈ ‘బేతాళుడు’ చిత్రాన్నితెలుగునాట తమ  ‘విన్.విన్.విన్. క్రియేషన్స్’ సంస్థ విడుదల చేయనుందని నిర్మాత ఎస్.వేణుగోపాల్ తెలిపారు.
‘బేతాళుడు’ : ‘సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్’
చిత్ర కథానాయకుడు ‘విజయ్ ఆంటోని’ మాట్లాడుతూ..’ నటునిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యం గా  ఉన్న నాకు కొనసాగింపు ఈ ‘సైతాన్’. ‘సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్’ ఈ చిత్రం. తెలుగునాట ‘బేతాళుడు’ పేరుతొ విడుదల అవుతోంది చిత్రం.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఈ చిత్రంలో నా పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నమైనదిగా ఉండటంతో పాటు, వైవిధ్యాన్ని సంతరించుకుని ఉంటుంది. నా సరసన ‘అరుంధతి నాయర్’ నాయికగా నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు ‘ప్రదీప్ కుమార్’ ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించేలా తీర్చిదిద్దుతున్నారని నమ్ముతున్నాను. ‘ప్రదీప్ కలపురయల్’ సినిమాటోగ్రఫీ ఓ ఎస్సెట్ ఈ చిత్రానికి. ‘సైతాన్’ కు సంగీతం నేనే. పాటలు,నేపధ్య సంగీతం ప్రేక్షకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. ‘బిచ్చగాడు’ విజయం తరువాత విడుదల అవుతున్న ‘సైతాన్’ చిత్రం పై సహజంగా అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటికి తగిన స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని తెలిపారు చిత్ర కథానాయకుడు ‘విజయ్ ఆంటోని’. తెలుగునాట నటునిగా తనకు ఈ చిత్రం మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుందని ఆశిస్తున్నాను అన్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu