దిల్ రాజుని భయపెట్టిన చరణ్ నిర్మాతలు!

అగ్ర నిర్మాత దిల్ రాజు ని చరణ్ నిర్మాతలు భయపెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం రంగస్థలం పై క్రేజ్ ఏర్పడటంతో ఆ చిత్రాన్ని నైజాం లో రిలీజ్ చేయాలనీ ముందుకు వచ్చాడు దిల్ రాజు . అయితే ఆ సినిమా హక్కుల కోసం మైత్రి మూవీస్ చెప్పిన రేటు చూసి షాక్ అయ్యాడట ! రంగస్థలం కేవలం నైజాం హక్కుల కోసం 20 కోట్లు చెల్లించాలని చెప్పారట. 

ఆ రేటు విన్న వెంటనే దిల్ రాజు షాక్ అయిపోయి మిన్నకుండి పోయాడట. దిల్ రాజు సైలెంట్ కావడంతో ప్రభాస్ నిర్మాతలు యువి క్రియేషన్స్ ముందుకు వచ్చి 18 కోట్ల కు బేరం కుదుర్చుకొని రంగస్థలం నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు . చరణ్ సినిమాకు ఒక్క నైజాం రేటు 18 కోట్లు అంటే చాలా ఎక్కువ అయినప్పటికీ ప్రభాస్ నిర్మాతలు ధైర్యం చేసి నైజాం పంపిణీ రంగంలో అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం అయితే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా పోస్టర్లు
మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!