HomeTelugu Big Storiesఅర్ధరాత్రి బెక్‌పై ఆస్టార్ హీరో కూతురుతో విజయ్‌ దేవరకొండ.. వైరల్‌

అర్ధరాత్రి బెక్‌పై ఆస్టార్ హీరో కూతురుతో విజయ్‌ దేవరకొండ.. వైరల్‌

7
టాలీవుడ్‌ క్రేజీ విజయ్ దేవరకొండ.. డైరెక్టర్‌ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరక్కెకుతున్న చిత్రం ‘ఫైటర్‌’. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఫైటర్‌ను తెలుగు, హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఫైటర్ కథ.. పాన్ ఇండియాకు అప్పీల్ అవుతుందని భావించిన కరణ్ జోహార్, పూరి, ఛార్మిలతో కలిసి ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదటినుండి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను తీసుకుంటున్నారని వార్తలు వినిపించాయి. అయితే జాన్వీ ఇతర సినిమాల్లో బిజీగా ఉండడంతో యంగ్ బ్యూటీ, నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే విజయ్ సరసన నటిస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. చిత్రీకరణలో భాగంగా తాజాగా విజయ్‌ అనన్యలపై రాత్రి సమయంలో ముంబయి రోడ్లపై బైక్‌రైడ్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. వీటికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీకవడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై వీధుల్లో జరుగుతోంది. విజయ్, అనన్యపై బైక్ పై వెళ్తుండగా విలన్ చేజింగ్ సిన్స్ ని దర్శకుడు పూరి తెరకేక్కిస్తున్నాడు.

ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ పై కరణ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. భారీ అంచనాల నడుమ ఈ సినిమాని దసరాకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu