HomeTelugu Big Storiesచిరంజీవి సినిమాలో విజయ్‌ దేవరకొండ!

చిరంజీవి సినిమాలో విజయ్‌ దేవరకొండ!

10 3

టాలీవుడ్‌ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొర‌టాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై నిరంజ‌న్‌రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. చిత్రీక‌రణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి దేవాదాయ అధికారిగా క‌నిపించ‌నున్నారు.

ఇందులోని కీల‌క పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. కాగా కరోనా కారణం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ వాయిదా పడింది. వైరస్‌ ప్రభావం తగ్గిన తరువాత ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ తిరిగి ప్రారంభించాల‌ని చిరంజీవి, కొర‌టాల భావిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమా త‌రువాత చిరంజీవి మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ ‘లూసీఫ‌ర్‌’ రీమేక్‌లో న‌టించ‌నున్నారు.

‘సాహో’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. సుకుమార్‌తో పాటు సుజీత్, రైట‌ర్ సాయిమాధ‌వ్ బుర్ర‌ ఈ చిత్ర క‌థ‌ని తెలుగు నేటి విటీకి అనుగుణంగా మార్పులు చేశారు. ఫైన‌ల్ స్క్రిప్ట్‌ని లాక్ చేశారు. ఇక ఈ చిత్రంలోని చిరంజీవికి చెల్లెలుగా ఖుష్బూ న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే పృథ్వీరాజ్ నటించిన ఓ కీలక పాత్ర‌లో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌నున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. చిత్ర బృందం ఇప్ప‌టికే హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని సంప్ర‌దించింద‌ని చెబుతున్నారు. అయితే ఈ వార్తను అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. ప్రస్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ ‘పూరి జ‌గ‌న్నాథ్’ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్థాయి ‘ఫైటర్‌’ మూవీ చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu