HomeTelugu Trendingపెళ్లిపై విజయ్‌ దేవరకొండ స్పందన

పెళ్లిపై విజయ్‌ దేవరకొండ స్పందన

Vijay Deverakondas reactioటాలీవుడ్‌ రౌడా హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా రేపు ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఒక ఫొటో వలన, ఆయన పెళ్లికి సంబంధించిన ప్రచారం ఊపందుకుంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ” నా ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను .. అదీ నాకు నచ్చిన అమ్మాయి దొరికితేనే” అని చెప్పాడు.

“పెళ్లి విషయంలో నేను ఎవరి కారణంగా ఒత్తిళ్లకు గురికాను. నా లైఫ్ పార్ట్నర్ గా వచ్చే అమ్మాయి, నా అలవాట్లను .. అభిరుచులను అర్థం చేసుకునేదై ఉండాలి. చాలా చిన్న చిన్న విషయాలుగా అనిపించేవి చూసినప్పుడు కూడా, తనే నాకు గుర్తుకు రావాలి. నా ఇష్టాలను .. తన ఇష్టాలుగా భావించి ఆనందించేదై ఉండాలి. ఇక ఎప్పుడు పెళ్లి చేసుకున్నా .. సింపుల్ గానే చేసుకుంటానని, హంగులూ .. ఆర్భాటాలు ఉండవని అన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu