HomeTelugu Trending'పుష్ప' నుంచి విజయ్‌ సేతుపతి ఔట్‌.. కారణం ఇదేనా!

‘పుష్ప’ నుంచి విజయ్‌ సేతుపతి ఔట్‌.. కారణం ఇదేనా!

2 25

ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హీరోగానే కాకుండా విలన్‌గానూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అందుకే తెలుగులో వరుస ఛాన్సులు అందుకుంటున్నాడు. సుకుమార్ బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’లో ముందుగా విజయ్ సేతుపతిని ఎంచుకున్నారు. అయితే విజయ్‌ సేతుపతి రెమ్యూనరేషన్ పెంచి, కండీషన్స్ పెట్టడంతో వేరొకరిని చూసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళంలో మంచి క్రేజ్ ఉండటంతో పాన్ ఇండియాగా తెరకెక్కే మూవీల్లో విజయ్ సేతుపతి ఉండేలా చూసుకుంటున్నారు మన దర్శకులు. సైరా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. సైరా తర్వాత విజయ్ ‘ఉప్పెన’ సినిమా చేస్తున్నాడు. సాయి ధరమ్‌ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడు. కాగా ఇప్పటికే ఉప్పెన సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. ఉప్పెన సినిమా కోసం విజయ్ రూ. 5 కోట్లు తీసుకున్నాడని, పుష్ప సినిమాలో పారితోషికం రూ.10 కోట్లు డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. పుష్పలో విజయ్ బదులు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉండటం కారణంగా డేట్స్ కుదరక పుష్ప నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu