HomeTelugu Trendingలాస్‌ ఎంజెల్స్‌లో విజయ్‌.. ఆ సినిమా కోసమేనా!

లాస్‌ ఎంజెల్స్‌లో విజయ్‌.. ఆ సినిమా కోసమేనా!

vijay thalapathy landed in
తమిళ స్టార్ హీరో విజయ్‌ ప్రస్తుతం ‘లియో’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ స్టార్ హీరో మరోవైపు దళపతి 68కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. తాజాగా దళపతి 68 సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా వెంకట్‌ ప్రభు అండ్‌ విజయ్‌ టీం లాస్‌ ఏంజెల్స్‌లో ల్యాండ్‌ అయింది. లాస్‌ ఏంజెల్స్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దిగిన విజయ్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

చెన్నై నుంచి సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో సింగపూర్‌, టోక్యో మీదుగా లాస్‌ ఏంజెల్స్‌ చేరుకుంది విజయ్‌ టీం. ఈ చిత్రంలో విజయ్ డ్యుయల్ రోల్‌లో నటిస్తుండగా.. విజయ్‌కు లాస్‌ ఏంజెల్స్‌లో లుక్‌ టెస్ట్ చేయబోతున్నారని తాజా సమాచారం. వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో పాన్ ఇండియా కథాంశంతో రాబోతున్న దళపతి 68లో సీనియర్ నటి జ్యోతిక హీరోయిన్‌గా నటించబోతుంది. మరో హీరోయిన్‌గా ప్రియాంకా ఆరుళ్‌ మోహన్‌ పేరు వినిపిస్తోండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ ప్రాజెక్ట్‌లో ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపించబోతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. దళపతి 68కు సంబంధించిన మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో అప్‌డేట్స్ అందించనుంది టీం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu