టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్‌కు ఓ రేంజ్లో స్పందన వచ్చింది. టాలీవుడ్ సహా అన్ని వుడ్‌లలోనూ ఉహించని స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా హిందీ నిర్మాతలు ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం కోట్లల్లో ఆఫర్ చేస్తున్నారట. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ వర్మ వినాయక చవితి నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు. చెప్పినట్లుగానే వినాయక చవితికి స్పెషల్ పోస్టర్‌తో ప్రమోషన్లు షురూ చేశారు. తేజసజ్జా వినాయకుడిని ఎత్తుకున్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. డాక్టర్ ఫేం వినయ్‌రాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
ప్రైమ్ షో ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా తెలుగు సహా 11 భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నంది. అందులో కొరియన్, జపనీస్, ఇంగ్లీష్, స్పానీష్, చైనీస్ భాషలు కూడా ఉన్నాయి. ఒక తెలుగు సినిమా ఇన్ని భాషల్లో రిలీజవడం ఇదే తొలిసారి.