HomeTelugu Trending'విరాటపర్వం' ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటన

‘విరాటపర్వం’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటన

Virata parvam movie trailer

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా.. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘విరాటపర్వం’ సినిమా నిర్మితమైంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా.. 1990 నాటి నక్సలిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. నక్సలైట్ నాయకుడిగా ఈ సినిమాలో రానా కనిపించనున్నాడు. ఆయనను ఆరాధించే యువతిగా సాయిపల్లవి కనిపించనుంది. కొన్ని కారణాల వలన ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్‌ ప్రారంభించారు. రేపు జూన్‌ 5న ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. దీనితో పాటు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్‌ని .. వేదికను ఫిక్స్‌ చేశారు. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ‘కర్నూల్’ లో నిర్వహించనున్నారు.

అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చాడు. ప్రియమణి .. నందితా దాస్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న రానాకి ఈ సినిమా ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu