HomeTelugu Trending'విరూపాక్ష' టీమ్‌ కొత్త సినిమా ప్రకటన!

‘విరూపాక్ష’ టీమ్‌ కొత్త సినిమా ప్రకటన!

Virupaksha teams new mov

చిన్న సినిమాగా విడుదలై భారీ హిట్ అందుకున్న చిత్రం ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. కార్తిక్‌ దండు దర్శకత్వంలో వచ్చాడు. సుకుమార్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి చేతులు కలిపింది. దర్శకుడు కార్తిక్‌ దండు, సుకుమార్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఈ రోజు సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

అన్వేషణలో భాగంగా ముగ్గురు వ్యక్తులు గుహల్లో వేలాడుతున్నట్లు పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ఇది మైథికల్ థ్రిల్లర్ అని పోస్టర్ లో చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉందని తెలిపింది. అయితే ఇది విరూపాక్షకు సీక్వెలా? లేక కొత్త చిత్రమా? అన్నది తెలియాల్సి ఉంది. హీరో, హీరోయిన్, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu