HomeTelugu Trendingప్రముఖ నటి ఆత్మహత్య

ప్రముఖ నటి ఆత్మహత్య

vj chitra commits suicide
తమిళనటి వీజే చిత్ర (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇటీవలే వ్యాపారవేత్త హేమంత్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. చెన్నైలోని ఓ హోటల్‌లో హేమంత్‌తో ఆమె ఉంటోంది. అయితే, ఈ రోజు ఉదయం స్నానం కోసం వెళ్లిన ఆమె అందులోంచి తిరిగిరాలేదు. దీంతో హేమంత్‌ హోటల్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మరో తాళం చెవిలో వారు గది తలుపులు తెరిచారు. ఆమె ఉరి వేసుకుని కన్పించడంతో వారంతా షాక్ అయ్యారు. ఆమె మృతి పట్ల తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. టీవీ షో ‘పాండ్యన్ స్టోర్స్‌’తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. త‌మిళ టీవీ రంగంలో ఎంతో పాప్యులారిటీ తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లో ఆమె న‌టించింది. ఆమె ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu