HomeTelugu Trending'వాల్తేరు వీరయ్య' టైటిల్ సాంగ్ వచ్చేసింది

‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ వచ్చేసింది

Waltair Veeraiah

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ మూవీ టైటిల్ సాంగ్‌ విడుదలైంది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. మాస్‌మహరాజ్ రవితేజ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి 2 పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. బాస్ పార్టీ సాంగ్, నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవి అవుతా.. అనే పాటలు విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా టైటిల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ఇప్పటికే రిలీజైన 2 పాటలు సినిమాపై క్రేజ్‌ను పెంచేశాయి. భగభగ మండే మగాడు రా వీడే.. అంటూ సాగే ఈ పాటతో సినిమాపై మరింత హైప్ పెరిగిందని చెప్పాలి. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu