ఏపీకి.. చంద్రబాబు ఏం చేశాడు ?, జగన్ ఏం చేశాడు ?

చంద్రబాబు నాయడు గారు సీఎం గా ఉంటే కలిగే లాభం ఏమిటి ?, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృధి మరియు సంక్షేమ పథకాలు లో బ్యాలన్స్ చేస్తూ లోటు బడ్జెట్ లో చక్కగా నడిపిస్తారు. నిజానికి ప్రస్తుతం జగన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు కంటే.. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పధకాలే ఎక్కువ. చంద్రబాబు గారు రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు అందించారు. రంజాన్, క్రిస్టమస్, సంక్రాంతి పండగలకి రాష్ట్రంలో కోటి 40 లక్షల కుటుంబాలకి ఉచితంగా రేషన్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ రెడ్డి కూడా ఈ సంఖ్యల దగ్గరే ఉన్నాడు.

చంద్రబాబు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 1033 వ్యాధులకి సంవత్సరానికి 250000 వరకు ఉచిత వైద్యం చేయించారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రి లో డయాలసిస్ చేయించుకునే రోగులకి పింఛన్లు ఇచ్చారు. 55 లక్షల మంది రైతులకి 25000 కోట్ల రుణమాఫీ దశలు వారిగా అమలు చేశారు బాబు. ఇంతవరకు జగన్ రెడ్డి ఈ విషయంలో రైతులను మోసం చేశాడు. ఇక చంద్రబాబు 9 లక్షల డ్వాక్రా గ్రూపులలో 90 లక్షల మహిళలు కి పసుపు కుంకుమ క్రింద 3000 చప్పున ఇచ్చారు. మరీ జగన్ రెడ్డి రూపాయి కూడా ఇవ్వలేదే. చంద్రబాబు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కి 43 శాతం వేతనం పెంచారు , మరియు రిటర్మెంట్ వయసు 60 చేశారు. మరీ జగన్ ఏం చేశాడు ?.

చంద్రబాబు 180000 సీపీఎస్ ఉద్యోగులకి గ్రాట్యుటీ, ఫ్యామిలి పెంచన్ మంజూరు చేశారు. అలాగే కాంట్రాక్ట్ ఔట్ సౌర్చింగ్ ఉద్యోగులకి 50 శాతం వేతనం పెంచారు. మరీ జగన్ రెడ్డి ఏం చేశాడు ?, ఏం చేయలేదే. చంద్రబాబు రెండున్నర కోట్లు అసంఘటిత కార్మికులకి చంద్రన్న భీమా ద్వారా రక్షణ కల్పించారు. రాష్ట్రంలో 5 కోట్లు ప్రజలకి ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలలో భాగం అయ్యారు. మరీ జగన్ రెడ్డి ఏం చేశాడు ?,

చంద్రబాబు ముస్లిం మహిళలకి దుల్హన్ పధకం ద్వారా వివాహ కానుకలు ఇచ్చారు. అదే విధంగా గిరిజన మహిళలు కోసం గిరి పుత్రిక కల్యాణ పథకం ఇచ్చారు. బీసీ, ఎస్ సీ మహిళలు కోసం చంద్రన్న పెళ్లికానుక ఇచ్చారు. గ్రామీణ మహిళలు ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళటానికి తల్లి బిడ్డా ఎక్స్ ప్రెస్ పెట్టారు. మరీ జగన్ రెడ్డి ఏం చేశాడు ?,

చంద్రబాబు ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువుగా జరిగాయి. బాబు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ జిడిపి వృద్ధి రేటు సగటున 11 శాతం పెరిగింది. హ్యాపీనెస్ ఇండెక్స్ లో భారత్ దేశం 130 స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 74 స్థానంలోకి వచ్చింది. ప్రజలు తలసరి ఆదాయం 89000 నుంచి 142000 అయ్యింది. కానీ, ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఆంధ్రుడు అప్పుల పాలయ్యాడు. అంతా గందరగోళం నెలకొంది. అందుకే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి.

CLICK HERE!! For the aha Latest Updates