Homeతెలుగు వెర్షన్వివేకా హత్య కేసు ఏమైందీ ?, ఇది దేశానికే ద్రోహం

వివేకా హత్య కేసు ఏమైందీ ?, ఇది దేశానికే ద్రోహం

What is the case of Vivekas murder It is a betrayal of the country

మళ్లీ మళ్లీ చెబుతున్నా… వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏ చిన్న పాజిటివ్ పాయింట్ రాయాలన్నా ఆవేదన కలుగుతుంది. క్రూర హంతకుల్ని కాపాడే వ్యవస్థల్ని చూసి, లోపల బాధ కడుపులో కాలుతోంది. జగన్ రెడ్డి లాంటి వారికి చిన్న లాభం చేకూర్చినా సరే, అది మోదీ దేశానికి ద్రోహం చేసినట్టే… ఆ జగన్ రెడ్డి అలాంటోడే… ఐనాసరే, మోదీ జగన్ రెడ్డి ప్రభుత్వానికి మేలు చేయడానికి ఆసక్తి చూపించడం చాలా దారుణం. వివేకానందరెడ్డి హత్య కేసు చేధించలేనంత క్లిష్టమైనదా ? ఏ క్లూ దొరకని మర్డర్ కేసుల్ని పోలీసులు వారం, పది రోజుల్లో చేధిస్తారు. కానీ అడ్డగోలుగా నరికేసినట్లుగా స్వయంగా ఆధారాలను నిందితులే ఇచ్చినా వివేకా హత్య కేసులో ఇంత వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అంటే.. కారణం ఏమిటి ?, మోదీ పక్కా రాజకీయ బుద్దితో ముందుకు పోతున్నాడు అనేగా.

కానీ, ప్రధాని స్థానంలో ఉండి.. రాజకీయ రొచ్చులో మునిగి తేలడం నీచం. వివేకానందరెడ్డిని హత్య చేసి నాలుగేళ్లవుతోంది. న్యాయం కోసం వివేకానంద రెడ్డి కుమార్తె ఎక్కని కోర్టు లేదు. కానీ న్యాయం కోసం పోరాడుతున్న ఆమెపైనే రివర్స్‌లో ఆరోపణలు చేస్తున్నారు. బహుశా కలికాలం అంటే ఇదేనేమో. దేశంలో ఇంత రాక్షస క్రీడ జరుగుతున్నా.. నేటికీ న్యాయం దొరక్కపోవడం మన దేశానికే అవమానం. అయితే, వివేకానందరెడ్డి హత్య కేసులో మోదీ ప్రభుత్వానిది కూడా తప్పు ఉంది. న్యాయవ్యవస్థలోని లోపాల్ని అడ్డం పెట్టుకుని ఆడుతున్న వారికి అండగా మోదీ నిలబడినందుకు కచ్చితంగా మోదీ తల దించుకోవాలి.

ఇండియా వ్యవస్థలు అధికారంలో ఉన్న పెద్దల ఒత్తిడికి తలొగ్గి నేరస్తుల్ని కాపడటానికి పరుగులు పెడుతున్న వైనం చాలా బాధను కలిగిస్తోంది. ప్రజల్ని విస్మయానికి గురి చేసే పరిస్థితులు మోదీ ప్రభుత్వమే కల్పిస్తోంది. తమకు ఎదురే లేదు అని మోదీ – షా ద్వయం భావిస్తూ ఉండొచ్చు. కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. గతంలో ఇందిరా గాంధీ, సీనియర్ ఎన్టీఆర్ లాంటి మహామహులనే ఓడించిన ప్రజా స్వామ్యం ఇది. ఇలాంటి ప్రజా స్వామ్యం మోదీ చాలా చిన్న వ్యక్తి. ఎల్లప్పుడూ తమ పాచికలు పారవు అని బీజేపీ ప్రభుత్వం అంగీకరించాలి. అసలు వివేకా హత్య కేసులో నిందితుడు అడిగితే దర్యాప్తు అధికారిని మార్చడం ఏమిటి మోదీ?,.ఇకనైనా వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాల విషయంలో నీతిగా నిజాయితీగా వ్యవహరించాలి. అప్పుడే న్యాయం బతుకుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu