HomeTelugu Trendingఅల్లు అర్జున్ బాలీవుడ్‌ ఎంట్రీ!

అల్లు అర్జున్ బాలీవుడ్‌ ఎంట్రీ!

2 21స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురం’ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ లుక్ ను విడుదల చేశారు. త్రివిక్రమ్ తనదైన శైలిలో టైటిల్ ను పెట్టి ఆశ్చర్యపరిచారు. అయితే, బన్నీ ఈ సినిమా తరువాత వేణు శ్రీరామ్ తో ఐకాన్, సుకుమార్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండింటిలో ఏ మూవీ ముందుగా రిలీజ్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటె, అల్లు అర్జున్ ఇటీవలే ముంబైలో డైరెక్టర్‌ నిఖిల్ అద్వానీతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్నాడు. దర్శకుడు నిఖిల్ తో కలిసి బన్నీ పార్టీలో పాల్గొనడంతో అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బన్నీ బాలీవుడ్ సినిమా గురించి. బన్నీ బాలీవుడ్‌లో సినిమా చేయబోతున్నారని, దానికోసమే అల్లు అర్జున్.. నిఖిల్ అద్వానీలు కలిసారని వార్తలు వస్తున్నాయి. గతంలో రామ్ చరణ్ జంజీర్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఆ సినిమా ఫెయిల్ అయ్యింది. అంతకు ముందు చిరంజీవి మూడు, వెంకటేష్, నాగార్జునలు రెండు సినిమాలు చేశారు. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి సినిమాతో బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇదే బాటలో అల్లు అర్జున్ కూడా నడుస్తాడా.. చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu