HomeTelugu Trendingరావాడానికి టైమ్‌ పడుతుంది కానీ రావడం పక్కా..

రావాడానికి టైమ్‌ పడుతుంది కానీ రావడం పక్కా..

6 10
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నుంచి అజ్ఞాతవాసి తరవాత మరో సినిమా ఏదీ రాలేదు. పవన్ రాజకీయాలతో బిజీ అయిపోయారు. ‘సినిమాలకంటే నాకు రాజకీయాలే ముఖ్యం’ అని చాలా సందర్భాల్లో వెల్లడించారు కూడా. అయితే ఇటీవల ఆయన రీ ఎంట్రీపై చాలా వార్తలు, కథనాలూ వచ్చాయి. ‘పింక్‌’ రీమేక్‌లో పవన్ నటిస్తారని ప్రచారం జరిగింది. దాన్ని పవన్ కూడా తోసిపుచ్చలేదు. దాంతో ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయం అనుకున్నారంతా. అయితే.. పవన్ రీ ఎంట్రీకి చాలా టైమ్‌ ఉందని తెలుస్తోంది. ఇప్పుడప్పుడే ‘పింక్‌’ రీమేక్ మొదలయ్యే అవకాశాల్లేవని సమాచారం.

పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ సమస్యలపై పోరాటం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. వాటికీ వ్యూహ రచన చేయాల్సివుంది. ఇంత కీలమైన సమయంలో సినిమా మొదలెడితే ఫలితాలు తేడాగా వచ్చే ప్రమాదం ఉందని పవన్ భావిస్తున్నారు. అందుకే…

ఇప్పుడప్పుడే సినిమాలవైపు రాకూడదని ఆయన అనుకుంటున్నారట. ‘మీరు కథలు సిద్ధం చేసుకోండి.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మొదలెడదాం’ అంటూ దర్శక నిర్మాతలకు ఓ హింట్ ఇచ్చారట పవన్‌. 2020 జనవరి వరకూ పవన్ సినిమాలపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాల్లేవని సన్నిహిత వర్గాలే చెబుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu