100 ఏళ్ళ భవనం కొనుగోలుచేసిన హీరోయిన్!

ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో ఫేమస్ అయిన యామీ గౌతమ్ ఇప్పుడు హీరోయిన్ గా తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది. తెలుగులో రెండు సినిమాల్లో నటించినా.. అమ్మడుకి పెద్దగా కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్ లో తన హవా సాగించాలని ఆశ పడుతోంది. ఇందులో భాగంగా హృతిక్ రోశన్ సరసన ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ హిమాచల్ ప్రదేశ్ లోని 100 ఏళ్ళ నాటి భవనాన్ని కొనుగోలు చేసింది. ఆ భవనం చుట్టూ.. 25 ఎకరాల ప్రదేశం ఉండగా.. మధ్యలో ఎంతో సుందరంగా ఈ ఇల్లు నిర్మించబడి ఉందట. చూడగానే యామీ ముచ్చటపడి ఈ ఇంటిని తన సొంతం చేసుకుందని సమాచారం. దీనికోసం భారీగానే ఖర్చు పెట్టినట్లు చెబుతున్నారు. మరికొందరు మాత్రం తక్కువ ధరకే ఇల్లు సొంతం చేసుకుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here