ఆ విషయంలో త్రివిక్రమ్ రాజీ పడ్డాడా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టైటిల్ గా ‘అజ్ఞాతవాసి’ అనే పేరుని ఫైనల్ చేశారు. అయితే ఈ విషయంలో త్రివిక్రమ్ రాజీ పడ్డాడనే మాటలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి  ఈసినిమాలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఒకకీలక పాత్రను చేస్తున్న నేపధ్యంతోపాటు ఈసినిమా కథ మొత్తంగా ఆమె చుట్టూతిరిగే పరిస్థితులలో ఆమె పాత్ర సినిమాకి హైలెట్ గా మారబోతున్ననేపధ్యంలో ఖుష్బూ పాత్రకి సెట్ అయ్యే విధంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ టైటిల్ ను సెట్ చేసుకున్నాడట. 

కానీ ఆతర్వాత ఈసినిమా బయ్యర్లు అదేవిధంగా పవన్ సన్నిహితుల నుండి వచ్చిన ఒత్తిడి మేరకు త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ అని సెట్ చేసి ‘ప్రిన్స్ ఇన్ ఎక్సైల్’ అనే   క్యాప్షన్ ఇచ్చాడట. ఓ హాలీవుడ్ మూవీచూసి ఇన్‌స్పైర్ అయి త్రివిక్రమ్ ఈమూవీని తీసినట్లు వార్తలు వస్తున్నాయి ‘ది హెయిర్‌ అప్పారెంట్‌’ అనే ఇంగ్లీష్‌ చిత్రాన్ని చూసిన తర్వాత త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ కథ రాసుకున్నాడని  తెలుస్తోంది.