HomeTelugu Big StoriesYatra-2: యాత్ర-2 ట్రైలర్‌ వచ్చేస్తుంది

Yatra-2: యాత్ర-2 ట్రైలర్‌ వచ్చేస్తుంది

yatra 2 trailer update

Yatra-2: ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో వస్తోన్న చిత్రం యాత్ర-2. యాత్రకు సీక్వెల్‌ గా వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అప్డేట్స్‌ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మహి వి రాఘవ్ డైరెక్షన్‌లో ‌ వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ వేగం పెంచారు మేకర్స్‌. ఇందులోభాగంగా యాత్ర 2 ట్రైలర్‌ను ఫిబ్రవరి 3న 11 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్ విడుదల చేశారు. తండ్రీకొడుకులిద్దరూ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రచార రథంపై ఉన్న లుక్‌ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది.

మరోవైపు తండ్రీకొడుకుల జనాల మనసులో ఎలాంటి చెరగని ముద్రవేసుకున్నారో తెలిపే ప్రయాణం నేపథ్యంలో సాగే చూడు నాన వీడియో సాంగ్‌తోపాటు తొలి సమరం పాట సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న టైమ్‌ ఈ సినిమా విడుదల కానుంది. ఈక్రమంలో ప్రేక్షకుల్లో ఆసక్తిని నెలకొంది.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu