HomeTelugu Newsఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు!

ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు!

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపోస‌. మిర్యా స‌త్య‌నారాయ‌ణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను న‌వంబ‌ర్ 11న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం చిత్ర‌యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో…
హీరో నాగ‌చైత‌న్య మాట్లాడుతూ.. ”రెండు, మూడు రోజుల్లో సినిమా సెన్సార్ జ‌రుపుకోనుంది. గౌత‌మ్ మీన‌న్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న ప్ర‌తిసారి ఏదో ఒక కొత్త విష‌యం నేర్చుకుంటూనే ఉన్నాను. న‌న్ను ఎప్పుడో ఏదో ఒక కొత్త స్ట‌యిల్‌లో ప్రెజెంట్ చేస్తుంటారు. అందుకు గౌత‌మ్ మీన‌న్ గారికి స్పెష‌ల్ థాంక్స్‌. ఏ మాయ చేశావే సినిమాకు ఎక్సెటెన్ష‌న్‌గా నా క్యారెక్ట‌ర్ ఈ సినిమాలో ఉంటుంది” అన్నారు.
నిర్మాత మిర్యాల రవీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ”గౌత‌మ్‌, చైత‌న్య కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఏ మాయ చేశావే సినిమా ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో మ‌న‌కు తెలిసిందో. గౌత‌మ్‌మీన‌న్‌గారు డైరెక్ట్ చేసిన ఏ మాయ చేశావే, ఘ‌ర్ష‌ణ సినిమాలు నాకెంతో ఇష్ట‌మైన‌వి. ఈ రెండు సినిమాల కాంబినేష‌న్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌లో ఈ సినిమా ఉంటుంది” అన్నారు.
గౌత‌మ్‌మీన‌న్ మాట్లాడుతూ.. ”సినిమా న‌వంబ‌ర్ 11న విడుద‌ల‌వుతుంది. నేను చేస్తున్న 18వ సినిమా. కార‌ణాలు తెలియ‌లేదు కానీ సినిమా ఆల‌స్య‌మైంది. చైతు మంచి పెర్‌ఫార్మెన్స్ చేసాడు. ఏ మాయ చేశావే నెక్ట్స్ లెవ‌ల్ మూవీ ఇది. యాక్ష‌న్‌, థ్రిల్లింగ్‌గా ఉంటుంది” అన్నారు.
మంజిమ మోహ‌న్ మాట్లాడుతూ.. ”నాపై న‌మ్మ‌కంతో నాకు అవ‌కాశం క‌లిగించిన గౌత‌మ్ మీన‌న్‌గారికి థాంక్స్‌. మంచి టీంతో వ‌ర్క్ చేశాను. చైతు మంచి కోస్టార్. రెహ‌మాన్‌గారి మ్యూజిక్ పెద్ద హిట్ అయ్యింది. సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దిల్ రాజు, కోనవెంకట్, బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu