ఒకే వేదికపై ముగ్గురు యంగ్‌ హీరోల అగ్రిమెంట్‌

ఈతరం హీరోలు ఈగోలను పక్కన పెట్టి ప్రెండ్లీగా ఉంటున్నారు. మల్టీస్టారర్‌ సినిమాలు చేయటంతో పాటు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తామే హీరోలుగా సినిమాలు నిర్మించటంతో పాటు ఇతర హీరోలతోనూ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ‘నిను వీడని నీడను నేనే’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వేదికగా యంగ్ హీరో ఇంట్రస్టింగ్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

నిను వీడని నీడను నేనే సినిమా కోసం సందీప్‌ కిషన్‌ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేదిక మీద పై తాను సుధీర్ బాబు హీరోగా ఓ సినిమాను నిర్మిస్తానంటూ ప్రకటించారు సందీప్‌. సుధీర్ బాబు కూడా తన బ్యానర్‌లో సందీప్‌ హీరోగా ఓ సినిమా నిర్మిస్తానని ప్రకటించాడు. వెంటనే వేదిక మీద ఉన్న మరో యంగ్ హీరో నిఖిల్.. ఈ ఇద్దరు హీరోల నిర్మాణంలో తాను ఫ్రీగా నటిస్తానంటూ ప్రకటించారు. ప్రస్తుతానికి ప్రకటనలతో సరిపెట్టినా తర్వలోనే ఈ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కితే బాగుంటుందంటున్నారు అభిమానులు‌.