హైకోర్టులో పిటిషన్ వేసిన వైఎస్ జగన్

తన చిన్నాన్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ పోలీసుల అజమాయిషీ లేని స్వచ్ఛంద దర్యాప్తు సంస్థచేత విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని కోరారు. హత్యను చిన్నదిగా చూపించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ పిటిషన్ వేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ హత్యను చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారణ వల్ల వాస్తవాలు బయటకు వస్తాయనే నమ్మకం లేదని.. కాబట్టి స్వతం‍త్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. టీడీపీ, చంద్రబాబు నాయుడు, ఏపీ డీజీపీ, కేంద్ర ప్రభుత్వం, సీబీఐ తదితర ఎనిమిది మందిని తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.