HomeTelugu News'యాత్ర' షాకింగ్‌ రన్ టైమ్..!

‘యాత్ర’ షాకింగ్‌ రన్ టైమ్..!

5 10దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌ ‘యాత్ర’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో మమ్ముట్టి ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా ఈ సినిమాను నిర్మించినట్టు తెలుస్తోంది. బయోపిక్ సినిమా అంటే అటు ఇటుగా రెండున్నర లేదంటే మూడు గంటల నిడివి ఉంటుంది. యాత్ర సినిమా అందుకు విరుద్ధంగా గంటా 57 నిమిషాల మాత్రమే నిడివి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రెండు గంటల కంటే తక్కువ సమయంలో దర్శకుడు మహి ఈ బయోపిక్‌లో ఏం చూపించి ఉంటాడనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

ఫిబ్రవరి 8 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నది. సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యి అందరిని ఆకట్టుకుంది. అంచనాలను పెంచింది. ఈ సినిమా పూర్తయ్యాక ఓ యాత్ర గురించి ఓ సాంగ్ ఉంటుందట. రచయిత పెంచల్ దాస్ రాసిన ఈ పాట కన్నీళ్లు తెప్పిస్తుందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu