HomeTelugu Newsఆది సాయికుమార్ పాన్ ఇండియా మూవీ

ఆది సాయికుమార్ పాన్ ఇండియా మూవీ

7a 3
యువ క‌థానాయ‌కుడు ఆది సాయికుమార్‌ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఒక సిరీస్‌లా చేయడానికి ప్లాన్ చేస్తుండ‌టం విశేషం. విభిన్న కథాంశాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆది సాయికుమార్‌కు ఈ పాన్ ఇండియా చిత్రం కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీ కానుందని భావిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఫాంట‌సీ ఎలిమెంట్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ల‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చిత్ర యూనిట్
చెబుతోంది.

య‌స్.వి.ఆర్ ప్రొడ‌క్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్‌పై కొత్త దర్శకుడు బాలవీర్.య‌‌స్‌ ద‌ర్శక‌త్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని య‌స్‌.వి.ఆర్ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఆది చేసిన చిత్రాల‌కు భిన్నంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. రెండేళ్లపాటు కష్టపడి ఈ సినిమా కథను తయారుచేసినట్టు తెలిపారు. ఈ పాన్ ఇండియా సిరీస్‌లో చాప్టర్1 త్వర‌లోనే ప్రారంభం కానుందన్నారు. ఆది చివరిగా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘జంగిల్’, ‘శశి’ సినిమాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu