అఖిల్ తో వర్మ సినిమా!

టాలెంట్ ఉన్న యంగ్ హీరో అఖిల్ కి విజయాలే కరువయ్యాయి. హీరోగా హిట్లు అందుకోవాలనుకుంటున్న అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఓ సంచలన దర్శకుడిని ఎంచుకున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం అఖిల్ అక్కినేని తన మూడో సినిమాను తొలి ప్రేమతో మంచి విజయం సాధించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కానీ ఇంతలో రామ్ గోపాల్ వర్మ ఓ సంచలనమైన వార్తను ప్రకటించాడు. అదేంటంటే..అఖిల్ నాలుగో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించాడు.ఆర్జీవీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఖరారు చేస్తూ .. ”దాదాపు 25 ఏళ్ళ క్రిందట నా మొదటి సినిమా శివను నాగార్జున నిర్మిస్తే… అదే 25 ఏళ్ళ తరువాత నాగార్జున సినిమాకి నేను నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించడం బాగుంది. ఇప్పుడు త్వరలోనే అఖిల్ సినిమాకు నేను దర్శకుడు, నాగార్జున నిర్మించనున్నాడు.ఈ సర్కిల్ చాలా చాలా బాగుంది” అని తెలిపారు. అయితే వర్మతో సినిమా అనేసరికే అభిమానులు బెంగపెట్టేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చాలా మంది చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates