అమితాబ్ సినిమాలో రెజీనా..?

అమితాబ్ సినిమాలో రెజీనా..?
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో రెజీనా చాలా బిజీగా ఉందనే చెప్పాలి. యువ హీఒలందరితో జత కడుతోన్న 
ఈ భామకు సరైన బ్రేక్ ఇచ్చే సినిమా పడలేదు. అయినా.. అమ్మడు చేతిలో అయిదారు ప్రాజెక్ట్స్ 
ఉన్నాయి. ఇది అధృష్టమనే చెప్పాలి. అయితే రెజీనాకు ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే 
కాకుండా బాలీవుడ్ లో కూడా ఛాన్స్ వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి. అది కూడా అమితాబ్ 
బచ్చన్ నటిస్తోన్న సినిమాలో.. 2002లో బాలీవుడ్ లో ‘ఆంఖేన్’ అనే సినిమా వచ్చింది. అప్పట్లో ఈ
సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అమితాబ్ బచ్చన్, సుష్మితా సేన్, అక్షయ్ కుమార్ వంటి నటులు 
చేసిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుందట. ఈ సినిమా సీక్వెల్ లోనే రెజీనాకు అవకాశం 
వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా కథ నచ్చడంతో, అది కూడా అమితాబ్ 
వంటి హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో రెజీనా మరో ఆలోచన లేకుండా 
ఒప్పేసుకుందట. ఈ సినిమా గనుక హిట్ అయితే బాలీవుడ్ లో అమ్మడుకి అవకాశాలు రావడం
ఖాయం. 
CLICK HERE!! For the aha Latest Updates