టాలీవుడ్ అందుకే వదిలేశా!

ఒకప్పుడు దక్షినాదిలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా ఇప్పుడు అదే చిత్ర
పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలనుకోవడానికి గల కారణాలను వివరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ అజయ్ దేవగన్ సరసన ‘రెయిడ్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలియానా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకుంటూ.. టాలీవుడ్ కు బాలీవుడ్ కు మధ్య ఉన్న తేడాలను తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకొచ్చింది.
తెలుగు సినిమాలలో నటించేప్పుడు అసలు అక్కడ సినిమాలు ఎలా తీస్తారో అర్ధమయ్యేది కాదు. నా మొదటి సినిమా తొలిరోజు షూటింగ్ జరుగుతునప్పుడు నా నడుముపై శంఖం వేసారు. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే నీ నడుము చాలా బాగుంది కాబట్టి ఇలా చేస్తే మరింత అందంగా ఉంటుందని అన్నారని వెల్లడించింది. ఇందులో తనకు లాజిక్ అర్ధం కాలేదని నడుముపై సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో చాలా ఇబ్బంది పడేదాన్నని, అసలు ఆ సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదని స్పష్టం చేసింది. బాలీవుడ్ లో మాత్రం ఇటువంటి అనుభవాలు ఎప్పుడు ఎదురుకాలేదని తెలిపింది.