‘టెంపర్’ రీమేక్ లో రాశిఖన్నా!

అప్పటివరకు కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ డాల్ గా కనిపించిన రాశిఖన్నా ‘తొలిప్రేమ’ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా తరువాత ఆమెకు వరుస అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తోంది.తాజాగా మరో తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాను హీరో విశాల్ తమిళంలో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశిఖన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మురుగదాస్ దగ్గర కో డైరెక్టర్ గా పనిచేసిన వెంకట్ మోహన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. విశాల్ సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు.