HomeTelugu Newsఅందమైన కథలో శ్రియ, నిహారిక

అందమైన కథలో శ్రియ, నిహారిక

టాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రియ, నిహారిక కొణిదెల ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్రానికి సుజన దర్శకత్వం వహిస్తున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా పాటలు అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌ ఈ మూవీతో నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. కాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దర్శకుడు క్రిష్‌, కథానాయకుడు వరుణ్‌తేజ్‌ ఈ శుభకార్యానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

7 10

ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి వరుణ్‌ క్లాప్‌ కొట్టారు. ఈ సందర్భంగా క్రిష్, వరుణ్‌ మూవీ యూనిట్‌కి శుభాకాంక్షలు చెప్పారు. శ్రియ సినిమాలో సవాలుతో కూడుకున్న ఆసక్తికర పాత్రలో నటిస్తున్నారని క్రిష్‌ ట్వీట్‌ చేశారు. ఇది ఓ అందమైన కథ అని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu