HomeTelugu Big Storiesరివ్యూ: జవాన్

రివ్యూ: జవాన్

నటీనటులు: సాయిధరమ్ తేజ్, మెహరీన్, ప్రసన్న
రచన-దర్శకత్వం: బి.వి.ఎస్.రవి
సంగీతం: ఎస్.ఎస్.తమన్
ఛాయాగ్రహణం: కె.వి.గుహన్
కూర్పు: శేఖర్
నిర్మాత: కృష్ణ
కథ:
జై(సాయి ధరం తేజ్)కు దేశభక్తి చాలా ఎక్కువ. రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో మెంబర్ గా ఉంటాడు. డి.ఆర్.డి.ఓ లో శాస్త్రవేత్తగా చేరాలనేది అతడి కోరిక. మరోవైపు కేశవ్(ప్రసన్న) ఉగ్రవాద దాడులు చేస్తుంటాడు. మాఫియాతో చేతులు కలిపి ఇండియన్ ఆర్మీ కోసం తయారు చేసిన ‘ఆక్టోపస్’ అనే మిస్సైల్ ను విదేశాలకు అమ్మాలని చూస్తుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా జై వారికి అడ్డుపడతాడు. దీంతో జై ద్వారానే ఆ మిస్సైల్ ను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తాడు కేశవ్. దానికి జై ఫ్యామిలీను అడ్డుపెట్టుకుంటాడు. మరి జై తన కుటుంబాన్ని, దేశ సంపదను కేశవ్ నుండి కాపాడుకున్నాడా..? ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్:
సాయి ధరం తేజ్ నటన
సెకండ్ హాఫ్
ఇంటర్వల్ బ్యాంగ్
మాటలు
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
క్లైమాక్స్
దేశ ద్రోహం చేయాలనుకునే వ్యక్తిని ఎదిరించి నిలిచే ఓ పౌరుడి కథే ఈ సినిమా. అయితే ఇటువంటి కథలతో ఇప్పటికే కుప్పలుతెప్పలుగా చాలా సినిమాలు వచ్చాయి. దర్శకుడు బివిఎస్ రవి కూడా ఇలాంటి రెగ్యులర్ కథనే ఎంపిక చేసుకున్నాడు. పోనీ స్క్రీన్ ప్లే ఏమైనా కొత్తగా ఉందా అంటే అదీ లేదు. హీరో, విలన్ల మధ్య జరిగే సన్నివేశాలనే సినిమా ప్రధాన ఆకర్షణ. వాటిని కూడా బలంగా తెరపై ఆవిష్కరించలేకపోయాడు. ఆడియన్స్ లో ఎక్కడా కూడా క్యూరియాసిటీ అనేది కలిగించలేకపోయారు.
దర్శకుడు రాసుకున్న సంభాషణలు మాత్రం ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశాలు మరింత రొటీన్ గా సాగుతున్నాయి. సినిమాలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మినహా మిగిలినవి పెద్దగా అలరించవు. ఆక్టోపస్ మిస్సైల్, ప్రాజెక్ట్ వంటి విషయాలు సామాన్య ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతాయో చెప్పలేని పరిస్థితి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

నటీనటులు: సాయిధరమ్ తేజ్, మెహరీన్, ప్రసన్న రచన-దర్శకత్వం: బి.వి.ఎస్.రవి సంగీతం: ఎస్.ఎస్.తమన్ ఛాయాగ్రహణం: కె.వి.గుహన్ కూర్పు: శేఖర్ నిర్మాత: కృష్ణ కథ: జై(సాయి ధరం తేజ్)కు దేశభక్తి చాలా ఎక్కువ. రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో మెంబర్ గా ఉంటాడు. డి.ఆర్.డి.ఓ లో శాస్త్రవేత్తగా చేరాలనేది అతడి కోరిక. మరోవైపు కేశవ్(ప్రసన్న) ఉగ్రవాద దాడులు చేస్తుంటాడు. మాఫియాతో చేతులు కలిపి ఇండియన్ ఆర్మీ కోసం తయారు చేసిన 'ఆక్టోపస్' అనే మిస్సైల్ ను...రివ్యూ: జవాన్