HomeTelugu Newsఅల్లు అర్జున్‌ నెక్ట్స్‌ మూవీ..!

అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ మూవీ..!

అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాతి చిత్రం దర్శకుడు కె.కుమార్ సినిమా చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా కొత్త చిత్రం గురించి ఇటీవల బన్నీ స్పందిస్తూ.. తన తదుపరి సినిమా గురించి ప్రకటించేవరకు కాస్త ఓపికపట్టాలని అభిమానులను కోరారు. తానో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నానని తెలిపారు. దాంతో బన్నీ చేయబోయే సినిమాలపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.

7 21

ఈ నేపథ్యంలో బన్నీ కొత్త చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. పునర్జన్మ కాన్సెప్ట్‌తో బన్నీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం. ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన మనం సినిమాను తెరకెక్కించిన విక్రమ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu