HomeTelugu Big Storiesఈ వారం బిగ్‌బాస్‌ నుండి నందిని ఔట్‌!

ఈ వారం బిగ్‌బాస్‌ నుండి నందిని ఔట్‌!

తెలుగు బిగ్‌బాస్‌ లోఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతవారం ఎవరూ ఎలిమినేట్ కాకపోవడం, శ్యామల, నూతన్ నాయుడు ఇంట్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే షోలో డబల్ ఎలిమినేషన్ ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఈ వారం ఒకరు మాత్రమే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. బిగ్‌ బాస్‌ లో గత రెండు వారాల ఎపిసోడ్స్‌లో చాలానే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

9 3

బాబు గోగినేని, గీతా మాధురి, కౌశల్‌, నందిని, దీప్తి వీరందరి మధ్య జరిగిన గొడవలతో ప్రేక్షకులకు కావలిసినంత ఫన్‌ దొరికేసింది. ఈ గొడవలపై గత వారం నాని వీరికి క్లాస్‌ కూడా పీకేశాడు. ఇదంతా గతం. కానీ శనివారం నాటి ఎపిసోడ్‌లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. హౌజ్‌మేట్స్‌లో ప్రత్యేకంగా ఉండే కౌశల్‌.. నిన్న నాని చేతికి అడ్డంగా దొరికిపోయాడు. టాస్క్‌లో భాగంగా కౌశల్‌, నందిని మధ్య జరిగిన సంభాషణను మళ్లీ ప్లే చేశాడు. దీంతో కౌశల్‌ తెల్లబోయాడు. అప్పటి వరకు తనకు తాను సమర్దించుకుంటూ చెప్పిన మాటలకు.. వీడియోలో చూపించిన దానికి భిన్నంగా ఉండటంతో కౌశల్‌ మాటమార్చేశాడు. నాని కాస్త మందలించాడు. తనకు బయట చాలా మంది ఫాలోవర్స్‌ ఉన్నారని, చాలా సపోర్ట్‌ చేస్తున్నారని, అలా గేమ్‌ ప్లే చేసి.. ఫ్లిప్‌ అవుతూ ఉంటే.. బయట ఫ్యాన్స్‌ కూడా ఫ్లిఫ్‌ అవుతారంటూ కౌశల్‌ను హెచ్చరించాడు. కౌశల్‌ నిజాలే మాట్లాడుతాడని, ధైర్యంగా ఏదైనా చెప్పగలడని, తన​ వ్యక్తిత్వానికి సోషల్‌ మీడియాలో భారీగానే ఫాలోయింగ్‌ పెరిగింది. ఇక ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో కౌశల్, దీప్తి నల్లమోతు, బాబు గోగినేని, గణేశ్, నందిని ఉండగా….కౌశల్, బాబు సేఫ్ అయినట్లు నాని శనివారం ప్రకటించాడు. మిగిలినవారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే షోలో తేలనుంది.

కాగా ఈ నేపథ్యంలో ఆదివారం ఎలిమినేట్‌ కాబోయేది నందినినే అని ప్రచారం సాగుతోంది. ఈ మధ్య నందిని డబుల్‌ గేమ్‌ప్లే చేస్తోందని, కావాలనే కౌశల్‌ను టార్గెట్‌ చేస్తోందంటూ సోషల్‌ మీడియాలో ఆమెపై నెగెటివిటీ ఎక్కువైంది. తనీష్‌తో క్లోజ్‌ అవడం.. వారిద్దరు కలిసి చేసే ఎక్సాట్రాలు.. నాని కూడా ఈ విషయంపై తరచూ అడగడం చూస్తూనే ఉన్నాం. సోషల్‌ మీడియాలో నందినిపై పెరుగుతోన్న నెగెటివిటీ కూడా ఎలిమినేషన్‌కు కారణమయ్యే అవకాశం ఉంది. ఇక రెండో వైపు.. గతవారం ఇద్దరు కంటెస్టెంట్‌లు ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఈ వారం హౌజ్‌లోంచి ఇద్దరు ఎలిమినేట్‌ కాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.. నందిని తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి గణేష్ అనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే గణేష్ ఔట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu