HomeTelugu Big Storiesఅలీ హాలీవుడ్ ఎంట్రీ

అలీ హాలీవుడ్ ఎంట్రీ

10 20
టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న నటుడు అలీ. బాలనటుడిగా ఇండస్ట్రీల్లో అడుగుపెట్టిన అలీ టాలీవుడ్, బాలీవుడ్‌ను దాటి ఇప్పుడు హాలీవుడ్‌కు పయనమవుతున్నాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో తెలుగువారిని కడుపుబ్బ నవ్వించిన హాస్య నటుడు. ఎన్నచేట డైలాగ్‌తో అలీ తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతాడు. ఇప్పుడు జగదీష్‌ దనేటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాతో అలీ హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను
చిత్రబృందం మీడియాకు వెల్లడించింది. ఒక స్ట్రయిట్‌ హాలీవుడ్‌ చిత్రం చేస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్‌ దనేటి అని తెలిపింది. ఈ ఇండో హాలీవుడ్‌ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్‌ ఫిల్మ్స్, పింక్‌ జాగ్వర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలిపింది.

ఈ సినిమా చిత్రీకరణ అనుమతుల విషయమై నటుడు అలీ, దర్శకుడు జగదీష్‌.. సమాచార, ప్రసారాల శాఖామంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను కలిశారు. తెలుగు రాష్ట్రంలో పుట్టి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తొలి భారతీయ దర్శకుడిగా అభినందించారు. హాలీవుడ్‌లో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచినందుకు జగదీష్‌ను మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశంసించారు. హాలీవుడ్‌ సినిమా చేయడం తనకు చాలా ఉత్సాహంగా ఉందని అలీ అన్నారు. హాలీవుడ్‌ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్‌ ఓ మార్గం చూపించేలా ఉంటాడనుకుంటున్నాను. మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌గారికి కృతజ్ఞతలు అని అలీ అన్నారు. జగదీష్‌ మాట్లాడుతూ.. ‘ఇండో హాలీవుడ్‌ సినిమాల్లో ఇదో ఉదాహరణగా నిలిచే చిత్రమవుతుందన్నారు. అలీని హాలీవుడ్‌లో పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu