HomeTelugu News'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో మరో పాత్ర ఎంట్రీ..!

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌లో మరో పాత్ర ఎంట్రీ..!

నందమూరి తారకరామారావు బయోపిక్‌ షూట్‌ శెరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రాని ‘ఎన్టీఆర్‌’ పేరుతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ప్రధాన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితంలో హరికృష్ణ కీలకమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయంలో హరికృష్ణ రథసారధిగా వ్యవహరించారు. ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఈ పాత్రకు సంబంధించిన కీలకమైన సమాచారం బయటకు వచ్చింది.

2 31

హరికృష్ణ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ ను ఎంపిక చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణతో కళ్యాణ్ రామ్ కు మంచి అనుబంధాలు ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన కుటుంబ సభ్యులను తీసుకోకపోవడంపై విమర్శలు వెలువడుతున్న సమయంలో ఆ విమర్శలకు చెక్ చెప్పేందుకు హరికృష్ణ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ ను ఎంపిక చేశారు. త్వరలోనే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తున్నది. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా అమితాబ్‌, నయన తార, విద్యబాలన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu