HomeTelugu Newsవెబ్‌ సిరీస్‌లో రౌడీ ఎంట్రీ..

వెబ్‌ సిరీస్‌లో రౌడీ ఎంట్రీ..

13 7
ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్‌ హీరోలు సైతం ఇప్ప్పుడు వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే రాజ్యం కాబోతుందని ఆలోచిస్తున్న నటీనటులు దర్శక నిర్మాతలు ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. సినిమాలకు మించిన బడ్జెట్లు పెట్టడానికి ఓటీటీ సంస్థలు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే మన టాలీవుడ్ నుండి హీరో హీరోయిన్స్ డైరెక్టర్లు వెబ్ సిరీస్ వైపు అడుగులు వేశారు. నందిని రెడ్డి సంకల్ప్ మొదలైన వారు ఇప్పటికే వెబ్ సిరీస్ డైరెక్షన్ లోకి దిగిపోయారు. సమంత , ప్రియమణి వంటివారు వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నారు.

తాజాగా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా వెబ్ సీరీస్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. విజయ్ నిర్మాణ సంస్థ అయిన కింగ్‌ ఆప్ ది హిల్స్ తరపున వెబ్ సిరీస్‌ ప్లాన్ చేస్తున్నాడట రౌడీ. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని తెలుస్తుంది. మహేంద్ర విజయ్ తమ్ముడు ఆనంద్ హీరోగా వచ్చిన దొరసాని సినిమా తెరకెక్కించారు. ఇక ఇప్పటికే ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విజయ్ ఆహాకి సంబంధించిన కొన్ని వెబ్ సిరీస్‌లలో పాలుపంచుకోబోతున్నాడని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu