HomeTelugu Newsఎఫ్‌2 రేపే ప్రారంభం

ఎఫ్‌2 రేపే ప్రారంభం

టాలీవుడ్‌ అగ్రకథనాయకుడు విక్టరీ వెంకటేష్ ‌-మెగా ప్రిన్స్‌ వరుణ్‌ క్రేజీ మల్టీస్టారర్‌ ‘ఎఫ్‌-2’కి ముహూర్తం కుదిరింది. హ్యాట్రిక్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్‌కు పెయిర్‌గా మెహ్రీన్‌ నటించనున్నారు. ఇక ఈ చిత్రం రేపు(శనివారం) అంటే జూన్‌ 23 నుంచి లాంఛ్‌ కానున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

7 14

 

అనిల్‌ రావిపూడి చిత్రాలలో ఎక్కువగా వినోదానికి ప్రాధాన్యత ఉంటుంది. పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌ వంటి చిత్రాలతో ఈ దర్శకుడు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించాడు. వెంకీ, వరుణ్ తో రూపొందించబోయే ఎఫ్‌2 కూడా పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో ఎఫ్‌-2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu