HomeTelugu Newsకేరళకి అల్లు అర్జున్‌ భారీ విరాళం

కేరళకి అల్లు అర్జున్‌ భారీ విరాళం

టాలీవుడ్‌ ప్రముఖ నటుడుల్లో అల్లు అర్జున్‌ ఒకరు. కేరళలో కూడ బన్నీకి మంచి ఫ్యాన్‌ బేస్‌ బాగానే ఉంది. బన్నీని అక్కడ అందరూ మల్లు అర్జున్‌ అని ప్రేమగా పిలుస్తుంటారు. ఏ స్టార్‌ హీరోకి లేనంద ఫాలోయింగ్‌ బన్నీకి ఉందక్కడ. అందుకే బన్నీ కూడా కేరళ అభిమానులపై ప్రత్యేక ప్రేమను చూపిస్తుంటారు.

8 10

ఇటీవలే కేరళలో భారీస్థాయిలో వరదలు సంభవించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగి చాలా మంది ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుని ఇబ్బందులుపడుతున్నారు. అందుకే బన్నీ వారి సహాయ నిధుల కోసం 25 లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్బంగా తనపై ప్రేమను చూపించే కేరళ వాసులకు తన హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందన్న ఆయన ఈ సహాయం చేయడం తన బాధ్యతని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu