HomeTelugu Newsక్రిష్ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ బయోపిక్

క్రిష్ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ బయోపిక్

బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నటరత్న డా. నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా NTR సినిమాను తెరకెక్కిస్తున్నారు ఆయన తనయుడు బాలకృష్ణ. ఇందులో ఎన్టీఆర్ పాత్రను నందమూరి బాలకృష్ణ చేస్తున్నారు. రామకృష్ణ సినీ స్టూడియోలో ఈ చిత్రంలో ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తొలుత తేజ దర్శకత్వం వహించాల్సి ఉండగా కొన్ని కారణాల వలన ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.

3 13

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హీరో బాలకృష్ణ నిన్న ఈ చిత్రంపై ఓ ప్రకటన చేశారు. NTR చిత్రాన్ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. అందులో…. నాటి రామకథను ఆ రాముడి బిడ్డలైన లవకుశలు చెప్పారు.. నేటి రామకథను ఈ రాముడి బిడ్డలైన మేము చెబుతున్నాం. చేసే ప్రతి పనిలో ప్రాణముంటుంది, ప్రతి ప్రాణానికీ ఓ కథ ఉంటుంది. ఈ కథ ఎవరుచెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది. నా వందో చిత్రాన్ని చరితగా మలచిన క్రిష్ జాగర్లమూడి ఈ చరిత్రకు చిత్ర రూపాన్ని ఇస్తున్నారని ఆనందంగా చెబుతున్నా. ఇది మా కలయికలో రెండో దృశ్య కావ్యం. మరో అఖండ విజయానికి అంకురార్పణం. నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది. మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది అంటూ బాలకృష్ణ వాయిస్ ను వీడియోలో పొందుపరిచారు.

4 11

Recent Articles English

Gallery

Recent Articles Telugu