HomeTelugu News'గీత గోవిందం'పై రామ్‌ చరణ్‌ ట్వీట్‌

‘గీత గోవిందం’పై రామ్‌ చరణ్‌ ట్వీట్‌

విజయ్‌ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’పై ఇప్పటికే ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. కాగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి, మహేశ్‌బాబు, సమంత, శరత్‌ మరార్‌, మారుతి, అనిల్‌ రావిపూడి తదితరులు ట్వీటర్‌ వేదికగా ఈ సినిమాను మెచ్చుకున్నారు.

8 14

తాజాగా ఈ సినిమాని చూసిన ‘రామ్‌చరణ్‌ ఫేస్‌బుక్‌లో స్పందించారు. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత పర్‌ఫెక్ట్ ‌ఛేంజ్‌ ఓవర్‌‌. తెరపై విజయ్‌ దేవరకొండ, రష్మిక సహజ నటన ట్రీట్‌లా అనిపించింది. వీళ్ల ప్రదర్శన స్క్రిప్ట్‌ను అందంగా తీర్చిదిద్దింది. గోపీ సుందర్‌ చక్కటి సంగీతం అందించారు. కథను చాలా చక్కగా రాశారు, తెరకెక్కించారు. ‘గీత గోవిందం’ దర్శకుడు పరుశురాంకు, ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు, జీఏ2 పిక్చర్స్‌కు శుభాకాంక్షలు’అని చెర్రీ పేర్కొన్నారు.

8a 4

హీరో సాయిధరమ్‌ తేజ్‌ కూడా ఈ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ‘గీత గోవిందం’ మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ప్రధాన తారాగణం విజయ్‌ దేవరకొండ, రష్మిక తమ చక్కటి నటనతో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.‌ బన్నీ వాసుకు, పరుశురాంకు అభినందనలు. వెన్నెల కిశోర్‌ నువ్వంటే ఎప్పుడూ ఇష్టమే. రాహుల్‌ రామకృష్ణ పెళ్లి ఎక్కడ చేద్దాం’ అని ట్వీట్‌ చేశారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu