HomeTelugu Newsచంద్రబాబు బయోపిక్‌ ఫస్ట్‌లుక్‌

చంద్రబాబు బయోపిక్‌ ఫస్ట్‌లుక్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాని వెంకట రమణ దర్శకుడు. జి.జె. రాజేంద్ర నిర్మిస్తున్నారు. చంద్రబాబుగా వినోద్‌ నువ్వుల, ఎన్టీఆర్‌గా భాస్కర్‌ నటిస్తున్నారు. రాజ్‌కుమార్‌ పీఆర్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. సినిమాకు ‘చంద్రోదయం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

6

కాగా ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే 80 శాతం పూర్తయినట్లు దర్శకుడు చెప్పారు. ‘దేశచరిత్రలోనే ఒక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు. సామాన్య కుటుంబంలో జన్మించి, అగ్ర స్థానానికి ఎదిగిన ఆయన జీవితం అందరికీ తెలియాలనే ఈ చిత్రాన్ని తీస్తున్నాం. చంద్రబాబు చిన్ననాటి జీవితం నుంచి ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రచార చిత్రంలో చంద్రబాబును చూపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి ఈ సెప్టెంబర్ 1కి 23 సంవత్సరాలవుతున్న సందర్భంగా చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేస్తామన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu