కొడుకుతో కూడా అలాంటి సినిమానే చేస్తాడా..?

దర్శకుడు పూరి జగన్నాథ్.. బాలకృష్ణ హీరోగా ‘పైసా వసూల్’ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. మొదటి రెండు రోజులు హవా చూపించిన ఈ సినిమా తరువాత ఢీలా పడిపోయింది. బాలకృష్ణ క్రేజ్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. ఒకే కథను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి సినిమా చేయడమే ‘పైసా వసూల్’ ఫెయిల్యూర్ కి కారణమని అందరూ అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయమై పూరి దగ్గర ప్రస్తావించగా.. ‘ఒక హోటల్ లో చట్నీ, టిఫిన్ ఒకే మాదిరి ఉంటుందని, రోజుకి ఒకలా ఉండదని.. దర్శకుడు తీరు కూడా ఒకేలా ఉంటుందని తన సినిమాలు ఇలానే ఉంటాయని’ సెలవిచ్చాడు. కాబట్టి ఆయన కొత్త జోనర్లు ప్రయత్నించే అవకాశం లేదని తెలిసిపోయింది. 
ఈ క్రమంలో తన తనయుడు ఆకాష్ హీరోగా పూరి ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తనే సొంతంగా నిర్మిస్తున్నాడు. అక్టోబర్ నెలలో షూటింగ్ మొదలవుతుందని హింట్ ఇచ్చేశాడు. పైసా వసూల్ సినిమా షూటింగ్ లోనే మొన్నటివరకు గడిపేసిన పూరి మరి కొడుకు కోసం కథ ఎప్పుడు రాసుకున్నాడో..? అక్టోబర్ లో అయితే షూటింగ్ ఉంటుందని చెప్పేశాడు. నా సినిమాలు ఇలాగే ఉంటాయని స్టేట్మెంట్ ఇచ్చిన పూరి.. కొడుకుతో కూడా అలాంటి రొటీన్ సినిమా చేసి ప్రేక్షకులకు వడ్డిస్తాడా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.