Homeతెలుగు వెర్షన్చింతా అనురాధ గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ఆమె పరిస్థితేంటి ?

చింతా అనురాధ గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ఆమె పరిస్థితేంటి ?

aa
ఈ రోజు రాజకీయ నాయకుల గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. చింతా అనురాధ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మర్టేరు గ్రామంలో మధ్యతరగతి దళిత కుటుంబంలో చింతా అనురాధ  జన్మించారు. మధ్యతరగతి దళిత కుటుంబంలో పుట్టి.. తక్కువ సమయంలోనే, పైగా చిన్న వయసులోనే ఎంపీ అయిన అతికొద్ది రాజకీయ వ్యక్తుల్లో  చింతా అనురాధ కూడా ఒకరు. ఇంతకీ రాజకీయ నాయకురాలిగా చింతా అనురాధ గ్రాఫ్ ఎలా ఉంది ?,  ప్రజల్లో చింతా అనురాధ పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో చింతా అనురాధ పరిస్థితేంటి ?, అసలు ఆమె నేపథ్యం ఏమిటి ?,  మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ చింతా అనురాధకి ఉందా? తెలుసుకుందాం రండి.
ముందుగా చింతా అనురాధ వ్యక్తిగత జీవితానికీ వస్తే.. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం హైదరాబాద్ లోని లలితా డిగ్రీ కళాశాలలో చింతా అనురాధ బి.ఎ పూర్తి చేశారు. అనురాధ తండ్రి దివంగత చింతా కృష్ణమూర్తి ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009 లోక్ సభ ఎన్నికల్లో అమలాపురం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అనంతర కాలంలో జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. కృష్ణమూర్తి వారసురాలిగా రాజకీయల్లోకి వచ్చిన అనురాధ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరి అమలాపురం పార్లిమెంట్ కోఆర్డినేటర్ గా పనిచేశారు.
చింతా అనురాధ మంచి టాలెంటెడ్ అని పేరు ఉంది. జగన్ రెడ్డిని ఆకట్టుకోవడంలో కూడా చింతా అనురాధ సక్సెస్ అయ్యింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో  అమలాపురం ఎంపీగా  చింతా అనురాధ ఎన్నికయ్యారు. అయితే అనురాధకి రాజకీయాల పై పెద్దగా అవగాహన లేకపోవడం, ప్రజల సమస్యలను సమర్థవంతంగా తీర్చలేక పోవడం వంటి అంశాలు ఆమె రాజకీయ ప్రభకు మైనస్ అయ్యాయి. ఇంతకీ వచ్చే ఎన్నికల్లో చింతా అనురాధ పరిస్థితి ఎలా ఉండబోతుంది ?, అలాగే ఆమె గ్రాఫ్ విషయానికి వస్తే..  చింతా అనురాధ ప్రజల్లో పట్టు కోల్పోయారు.
దీనికితోడు చింతా అనురాధ అమలాపురం ఎంపీగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో కంటే.. ఆమె ఎక్కువగా హైదరాబాద్ లేదా ఢిల్లీలో నివాసం ఉంటారని స్థానిక ప్రజల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. పైగా చింతా అనురాధ తీరు పై కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. రాజకీయంగా మౌనంగా ఉండటం తప్పితే ఆమె వల్ల  నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో చింతా అనురాధ మళ్లీ గెలిచే అవకాశం లేదు. కాబట్టి చింతా అనురాధకి ఇక రాజకీయ భవిష్యత్తు లేకపోవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!