
Tollywood Producers risk with Tamil Heroes:
ఇప్పటి ట్రెండ్ చూస్తే, టాలీవుడ్ నిర్మాతలు తమిళ సినిమాల తెలుగు హక్కుల కోసం భారీ మొత్తాలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఇవి అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. నిజం చెప్పాలంటే, తెలుగు ప్రేక్షకులు తమిళ హీరోలను స్టార్‌లా ట్రీట్ చేస్తుంటారు. కానీ తమిళనాడు ప్రేక్షకులు మాత్రం మన హీరోల సినిమాలకు అంతగా స్పందించరు.
ఉదాహరణకి, కమల్ హాసన్ నటించిన “థగ్ లైఫ్” సినిమాకు తెలుగు థియేట్రికల్ హక్కులు రూ.18 కోట్లు పలికాయి. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.4 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ‘విక్రమ్’, ‘జైలర్’, ‘అమరన్’ మినహా ఇటీవలి కాలంలో వచ్చిన తమిళ సినిమాలు అన్నీ డిజాస్టర్స్ గానే నిలిచాయి. రజనీకాంత్ సినిమాలు కూడా కోవిడ్ తర్వాత తెలుగు మార్కెట్‌లో భారీ నష్టాలు మాత్రమే మిగిల్చాయి.
ఇక సూర్య, కార్తీ, విషాల్ వంటి హీరోల సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. ధనుష్ సినిమా “కుబేరా” తెలుగు డబ్ కాకుండా డైరెక్ట్‌గా రూపొందింది కాబట్టి మంచి ఫలితం ఇచ్చింది. కానీ ఆయన ఇతర తమిళ సినిమాలు మాత్రం తెలుగులో డిజాస్టర్స్‌గానే నిలిచాయి.
తాజాగా రజనీకాంత్ నటించిన “కూలీ” సినిమాకూ తెలుగు హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఇది హిట్ అయితే డబ్బులు తిరిగి వస్తాయి కానీ లాభాలు పెద్దగా ఉండవు. ఫ్లాప్ అయితే నిర్మాతలకు భారీ నష్టం తప్పదు.
అయితే తమిళ నిర్మాతలు మాత్రం మన తెలుగు హీరోల సినిమాల హక్కుల కోసం పరుగులు తీయడం లేదు. మన వాళ్లు మాత్రం డబ్బింగ్ సినిమాల మీద బోలెడన్ని ఆశలు పెట్టుకొని పెద్ద మొత్తాలు వెచ్చిస్తున్నారు. ఇది మంచి పరిణామమా? లేదా రిస్క్ ఫ్యాక్టరా? అనే ప్రశ్న టాలీవుడ్‌ని వేధిస్తోంది.
ALSO READ: Tollywood 2025 లో హిట్‌లు కంటే ఫ్లాప్‌లే ఎక్కువా?