Homeతెలుగు వెర్షన్చైతన్య అక్కినేని 'ప్రేమమ్' తొలి పాట విడుదల

చైతన్య అక్కినేని ‘ప్రేమమ్’ తొలి పాట విడుదల

చైతన్య అక్కినేని ‘ప్రేమమ్’ తొలి పాట  విడుదల 

చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో, దర్శకుడు ‘చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న  చిత్రం ‘ప్రేమమ్’. 

 ఈ చిత్రం లోని ఒక పాటను ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ లో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు చైతన్య అక్కినేని మాట్లాడుతూ.. ‘ నా  మనసుకు బాగా హత్తుకున్న చిత్రం ఇది అన్నారు.

 యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..’ ఎవరే .. అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. . ఈ నెల 24 న ఆడియోను చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని  తెలిపారు.   

చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, 

పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని;

 చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని:

 ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు;

 ఆర్ట్: సాహి సురేష్; 

ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్;

సమర్పణ: పి.డి.వి. ప్రసాద్

నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ 

స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: చందు మొండేటి

design-4 STILL

Recent Articles English

Gallery

Recent Articles Telugu