HomeTelugu Big Storiesజయలలిత బయోపిక్‌కు మూర్తం ఫిక్స్‌

జయలలిత బయోపిక్‌కు మూర్తం ఫిక్స్‌

తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత బయోపిక్‌పై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంత వరకు ఏ ప్రాజెక్ట్ ఫైనల్‌ కాలేదు. తాజాగా ఓ నిర్మాణ సంస్థ అమ్మ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విబ్రి మీడియా సంస్థ జయలలిత బయోపిక్‌ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రకటనను విడుదల చేసి విబ్రి మీడియా ఎంతో ప్రభావవంతమైన మహిళ నేత జీవిత చరిత్రను రూపొందించటం గర్వంగా ఉందని ప్రకటించారు. ఈ బయోపిక్‌ సినీ రాజకీయ రంగాల్లో ఆమె సాధించిన విజయాలకు ఓ నివాళిగా రూపొదిస్తున్నట్టుగా తెలిపారు.

8 13

అయితే ఈ బయోపిక్‌ను జయలలిత జయంతి సందర్భంగా ఫిబ్రవరి 24 ప్రారంభిస్తామని అదే రోజు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తామని వెల్లడించారు. మదారసీ పట్టణం సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అవార్డ్‌విన్నింగ్‌ దర్శకుడు విజయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాతో తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన ప్రముఖ నటించనున్నారని వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu