అటువంటి లోదుస్తులే నాకు కంఫ‌ర్ట్‌గా ఉంటాయి.. విద్యాబాలన్ హాట్ కామెంట్స్


ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ల‌కు సిగ్గు అనే ప‌దం పూర్తిగా పోయింది.. తాజాగా విద్యాబాల‌న్ కూడా ఇదే లిస్టులోకి చేరిపోయింది. ఒక‌ప్పుడు విద్యాబాలన్ అంటే ఫ్యామిలీ ఇమేజ్ ఉండేది. కొన్నేళ్ల పాటు అదే ఇమేజ్ మెయింటెయిన్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. కానీ డ‌ర్టీ పిక్చ‌ర్ త‌ర్వాత విద్యాబాలన్‌ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు చాలా ప‌ద్ధతిగా క‌నిపించిన ఈ అమ్మడు‌.. ఆ త‌ర్వాత ఒక్క‌సారిగా రెచ్చిపోయింది.

ఇక ఈ మ‌ధ్యే ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకం త‌న క్యారెక్టర్‌కి వందశాతం న్యాయం చేసింది. ఇప్ప‌టికే 40వ పడిలో పడిన ఈ భామ.. ఇప్పుడు తన వయసు గురించి హాట్ కామెంట్స్ చేసింది. అడిగిన దానికి ఏ మాత్రం దాచుకోకుండా స‌మాధానం చెప్పింది విద్యాబాల‌న్. ఆ మ‌ధ్య ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 40 ఏళ్ల తర్వాత కూడా ఇంకా నాటీగా హాటీగా ఉన్నా.. సహజంగా ఈ వయసులో సిగ్గు ఉంటుంది. సెక్స్ ఎంజాయ్ చేయలేము అంటారు. కానీ వయసుతో పాటే మహిళల్లో అనుభవం కూడా పెరుగుతుంది.

అంతా మీ దృష్టిలోనే ఉంది. అది సంతోషం. నువ్వు దేన్నీ లెక్కచేయలేదనుకో, అప్పుడు నువ్వు మరింత సంతోషంగా ఉంటావు.. అని కాస్త ప‌చ్చిగానే మాట్లాడింది. ఇక ఇప్పుడు మీ బాడీలో ఏ భాగంపై వేసుకునే దుస్తులు మీకు కంఫ‌ర్ట్ అనిపిస్తాయంటే.. చాలా ఓపెన్ ఆన్స‌ర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ఎద భాగాన్ని క‌వ‌ర్ చేసే బ్రా అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని.. కంఫ‌ర్ట్ బ్రా ధ‌రించ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్నిస్తుంద‌ని చెప్పింది విద్యాబాల‌న్. ఆ తర్వాత కాటన్ శారీస్ కూడా ఇష్టమని చెప్పింది విద్యాబాలన్. అస‌లు ఇంత ఓపెన్ స‌మాధానం అడిగిన జ‌ర్న‌లిస్ట్ కూడా ఊహించి ఉండ‌డేమో..? కానీ విద్యాబాల‌న్ మాత్రం చాలా ఓపెన్ అయిపోయి ఏమీ దాచుకోకుండా స‌మాధానంతో పాటు బోన‌స్ గా షాక్ కూడా ఇచ్చింది.