HomeTelugu Newsజూన్ 1న విశాల్ ''అభిమన్యుడు''

జూన్ 1న విశాల్ ”అభిమన్యుడు”

విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందించిన యాక్షన్, ఎంటర్ టైన్ మూవీ ”ఇరుంబుతెరై” చిత్రాన్ని ”అభిమన్యుడు” పేరుతో ఎం. పురుషోత్తమన్ సమర్పణలో హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి. హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్ 1న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

2 4

తమిళంలో పెద్ద హిట్టైన ”ఇరుంబుతెరై” తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని హీరో విశాల్ తెలిపారు. తమిళంలో లాగే తెలుగులో కూడా అభిమన్యుడు చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుందని, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, తెలుగులో కూడా నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఆశిస్తున్నట్లు విశాల్ అన్నారు.

ఈ చిత్రంలో హీరో విశాల్ తో పాటు సమంత, యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 25న ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేయబోతున్నట్లు హరివెంకటేశ్వర పిక్చర్స్ అధినేత జి.హరి అన్నారు. జూన్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల చేస్తున్నామని, తెలుగులో ఈ చిత్రం తమిళ్ కంటే పెద్ద విజయాన్ని సాధిస్తుందని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu