HomeTelugu Trendingత్రివికమ్‌ యూజ్‌ లెస్‌ ఫెల్లో.. నటి సంచలన వ్యాఖ్యలు

త్రివికమ్‌ యూజ్‌ లెస్‌ ఫెల్లో.. నటి సంచలన వ్యాఖ్యలు

Tollywood actress Sensationనటి పూనమ్ కౌర్ ఎప్పుడు ఎదో ఒక వివాదస్పద వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతునే ఉంటుంది. ఆమె ఎక్కువగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల మీద కౌంటర్లు వేసినట్టుగానే ట్వీట్లు పెడుతుంది. పవన్ కళ్యాణ్ మీద కొన్ని సార్లు విమర్శలు చేస్తూ పెట్టిన ట్వీట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

ఇక గురూజీ అంటూ వేసే ట్వీట్లు ఎప్పుడూ చర్చలకు దారి తీస్తుంటాయి. పూనమ్ కౌర్-పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల మధ్య ఓ వివాదం ఉంది అని గతంలో కత్తి మహేష్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరుకూ ఇండైరెక్ట్ అటాక్ చేసిన పూనమ్ ఈసారి పేరు పెట్టి మరీ తిట్టింది.

తాజాగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో భాగంగా త్రివిక్రమ్‌ను ప్రస్థావించాడు. తనకు పులి, సింహం అంటూ డైలాగ్స్ చెప్పడం అంతగా ఇష్టం ఉండదని, అత్తారింటికి దారేది సినిమాలో సింహం గడ్డం గీసుకోదు. నేను గీసుకుంటాను అనే డైలాగ్‌ను చెప్పడానికి ఇబ్బంది పడ్డాను.

Tollywood actress 1

దీంతో త్రివిక్రమ్ గారు కామెడీగా చెప్పండని అన్నారు. కామెడీగా అయితే ఏదైనా చెప్పేస్తాను అంటూ నాడు జరిగిన ఘటన గురించి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక ఈ వీడియోను ట్విట్టర్‌లో ఓ మీడియా సంస్థ పోస్ట్ చేయగా.. దానికి పూనమ్ రిప్లై ఇచ్చింది.

యూజ్ లెస్ ఫెల్లో అంటూ త్రివిక్రమ్ పేరును పెట్టేసింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు. మొదటిసారి ఇలా నేరుగా ఓ పేరు పెట్టి ట్వీట్ వేశావ్.. అని నెటిజన్లు కామెంట్లు చేశారు. మరి పూనమ్ వేసిన ట్వీట్‌పై త్రివిక్రమ్ ఏమైన స్పందిస్తాడేమో చూడాలి. పూనమ్ కౌర్ త్రివిక్రమ్ చేసిన ఈ ట్వీట్‌ మాత్రం చర్చనీయాంశంగా మారింది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu